తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వాఘా సరిహద్దు​​లో మికాసింగ్ హల్​చల్​..! - bollywood

పాకిస్థాన్​లో పెళ్లికి హాజరై, అనంతరం స్వదేశానికి తిరిగి చేరుకున్న బాలీవుడ్​ సింగర్​ మికా సింగ్ ఇరు దేశాల మధ్యలో ఉన్న వాఘా సరిహద్దు వద్ద సందడి చేశాడు. 'భారత్​ మాతా కీ జై' అంటూ నినదించాడు.

మికా సింగ్

By

Published : Aug 16, 2019, 4:03 PM IST

Updated : Sep 27, 2019, 4:57 AM IST

బాలీవుడ్ గాయకుడు మికాసింగ్... పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ బంధువుల వివాహం కోసం పాకిస్థాన్​ వెళ్లాడు. అక్కడ ప్రదర్శన ఇచ్చినందుకు ఆల్​ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ అతడిపై నిషేధం విధించింది. అనంతరం స్వదేశానికి వస్తూ వాఘా సరిహద్దు​ దగ్గర భారత్​ మాతా కీ జై, వందేమాతరం అంటూ నినదించాడు. ఆ వీడియోను ట్విట్టర్​లో పోస్ట్ చేశాడు.

"భారత్​ మాతా కీ జై! నన్ను సాదరంగా ఆహ్వానించినందుకు అందరికి ధన్యవాదాలు. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు, మన జవాన్లకు సెల్యూట్. మనం సంతోషంగా ఉండేందుకు వాళ్లు ఎలాంటి పండుగలు జరుపుకోరు. జై హింద్" -మికా సింగ్​

ఆగస్టు 9న పాకిస్థాన్ కరాచి వెళ్లిన మికా సింగ్, భారత్​కు గురువారం తిరిగి వచ్చాడు. తన నిషేధం విషయమై స్పందించని మికా సింగ్... ట్విట్టర్​లో ఈ వీడియోను పంచుకోవడం ఆసక్తికరంగా మారింది.

ఇది చదవండి: ఆ చిత్రాలతో మియా సంపాదన ఎంతో తెలుసా..!

Last Updated : Sep 27, 2019, 4:57 AM IST

ABOUT THE AUTHOR

...view details