తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Mehreen Marriage: హీరోయిన్ మెహరీన్ పెళ్లి క్యాన్సిల్ - movie news

యువ కథానాయిక మెహరీన్.. తన పెళ్లిని రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. ట్విట్టర్​ వేదికగా ఈ విషయమై స్పష్టత ఇచ్చింది. అయితే ఎలాంటి కారణాలను వెల్లడించలేదు.

Mehreen cancel her marriage with bhavya bishnoi
మెహరీన్

By

Published : Jul 3, 2021, 5:17 PM IST

Updated : Jul 3, 2021, 5:34 PM IST

హీరోయిన్​ మెహ్రీన్ తన నిశ్చితార్ధాన్ని క్యాన్సిల్ చేసుకుంది. అలానే భవ్య బిష్ణోయ్​ను పెళ్లి చేసుకోవట్లేదని స్పష్టం చేసింది. ఇది తామిద్దరం చర్చించి తీసుకున్న నిర్ణయమని ట్వీట్ చేసింది. ఈ విషయాన్ని అందరూ అర్ధం చేసుకుని, తన ప్రైవసీకి భంగం కలిగించరని ఆశిస్తున్నట్లు పేర్కొంది.

హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్​లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్. మార్చిలో హీరోయిన్​ మెహరీన్ నిశ్చితార్ధం అతడితో జరిగింది. అనంతరం కొవిడ్ పరిస్థితుల కారణంగా తమ పెళ్లిని కొన్నాళ్లు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఏకంగా పెళ్లినే రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం మెహరీన్.. 'ఎఫ్3'తో పాటు సంతోష్ శోభన్​ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలోనూ హీరోయిన్​గా నటిస్తోంది. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.

భవ్య బిష్ణోయ్​తో మెహరీన్

ఇవీ చదవండి:

Last Updated : Jul 3, 2021, 5:34 PM IST

ABOUT THE AUTHOR

...view details