తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మా' ఎన్నికలపై రంగంలోకి 'మెగాస్టార్​' - మా ఎన్నికలు

'మా' క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ కృష్ణంరాజుకు మెగాస్టార్​ చిరంజీవి లేఖ రాశారు. 'మా' ఎన్నికలు జాప్యం లేకుండా వెంటనే జరగాలని సూచించారు.

megastar chiranjeevi
చిరంజీవి

By

Published : Aug 9, 2021, 8:22 PM IST

Updated : Aug 9, 2021, 9:55 PM IST

గత కొన్ని రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలపై అగ్ర కథానాయకుడు చిరంజీవి స్పందించారు. మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సభ్యులు ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో చిరు పెదవి విప్పారు. 'మా' క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖ రాశారు. మా ఎన్నికలు వెంటనే జరపాలని.. ఎన్నికలు ఆలస్యమైతే సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని లేఖలో పేర్కొన్నారు.

సభ్యుల బహిరంగ ప్రకటనలతో 'మా' ప్రతిష్ట మసకబారుతోందని, 'మా' ప్రతిష్ఠ దెబ్బతీస్తున్న ఎవర్నీ ఉపేక్షించవద్దని చిరంజీవి లేఖలో కృష్ణంరాజును కోరారు. ప్రస్తుతం ఉన్నది ఆపద్ధర్మ కార్యవర్గమేనని స్పష్టం చేశారు. సమస్యను కృష్ణంరాజు త్వరగా పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లు చిరంజీవి అభిప్రాయపడ్డారు.

చిరంజీవి లేఖ
చిరంజీవి లేఖ
Last Updated : Aug 9, 2021, 9:55 PM IST

ABOUT THE AUTHOR

...view details