తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చిరు రీఎంట్రీ.. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ప్రకటనల్లో? - chiru acharya movie

Chiranjeei movies: సెకండ్ ఇన్నింగ్స్​లో ఊపు మీదున్న చిరు.. సినిమాలతో ఫుల్​ బిజీగా ఉన్నారు. మరోవైపు ప్రకటనల్లోనూ కనిపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

chiranjeevi
చిరంజీవి

By

Published : Feb 9, 2022, 12:18 PM IST

Chiru ads: మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం యువ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. 'శంకర్‌ దాదా జిందాబాద్‌' తర్వాత సినిమాలకు విరామం ప్రకటించిన చిరు.. దాదాపు పదేళ్ల తర్వాత 'ఖైదీ నం. 150'తో రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం 'ఆచార్య', 'గాడ్‌ ఫాదర్‌', 'భోళా శంకర్‌'తోపాటు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రకటనల్లోనూ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

ఓ ప్రముఖ రియల్‌-ఎస్టేట్‌ సంస్థ చిరును తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండమని ఇటీవల కోరడంతో ఆయన ఒప్పుకున్నారట. ఇందుకోసం భారీ మొత్తంలో రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నారని, ఈ మేరకు ఒప్పందం కూడా కుదిరిందని సమాచారం. రియల్‌-ఎస్టేట్‌ సంస్థ పనితీరు నచ్చడం వల్లే చిరు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండేందుకు ఓకే చెప్పారట. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడికానున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి

గతంలో చిరు 'థంబ్స్‌అప్‌', 'నవరత్న ఆయిల్‌' బ్రాండ్స్‌ ప్రకటనల్లో కనిపించారు. మళ్లీ 13 ఏళ్ల తర్వాత ప్రకటనలో నటించబోతున్నారు. ఇప్పటికే చిరంజీవి తనయుడు, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ఓ రియల్‌-ఎస్టేట్‌ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నారు. దీంతో ఈ తండ్రికుమారులిద్దరూ సినిమాలతోపాటు ప్రకటనల్లోనూ పోటీ పడబోతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details