తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దేవకట్టాతో మెగా మేనల్లుడి చిత్రం..! - సాయితేజ్-దేవకట్టా

'ప్రతిరోజూ పండగే' చిత్రంతో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు మెగా మేనల్లుడు సాయితేజ్. తాజాగా ఈ హీరో.. వైవిధ్యభరిత దర్శకుడు దేవకట్టాతో ఓ సినిమా చేయబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి.

mega hero
దేవకట్టా

By

Published : Dec 23, 2019, 4:17 PM IST

సాయితేజ్‌కి 2019కి చాలా బాగా కలిసొచ్చింది. వరుస పరాజయాలకు చెక్‌ పెడుతూ ఏడాది ఆరంభంలో 'చిత్రలహరి'తో చక్కటి విజయాన్ని ఖాతాలో వేసుకున్న తేజు.. ముగింపులో 'ప్రతిరోజూ పండగే'తో పండగ లాంటి మరో హిట్‌ను దక్కించుకున్నాడు. ఇప్పుడీ ఉత్సాహంలో కొత్త ఏడాదిని సరికొత్త ప్రాజెక్టులతో షురూ చేయబోతున్నాడీ మెగా మేనల్లుడు.

ఇప్పటికే ఈ యువ హీరో చేతిలో 'సోలో బ్రతుకే సో బెటర్‌' చిత్రముంది. నూతన దర్శకుడు సుబ్బు తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చిత్రీకరణను ప్రారంభించుకుంది. దీన్ని మేడే కానుకగా మే1న విడుదల చేయబోతున్నారు. ఇది పూర్తయిన వెంటనే వైవిధ్యభరిత దర్శకుడు దేవ కట్టాతో ఓ సినిమా చేయనున్నాడట. ఇప్పటికే కథ విషయమై దేవ.. తేజుతో చర్చలు జరిపాడని, స్క్రిప్ట్‌ కొత్తగా ఉన్నందున తను కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా మొదలైపోయాయట.

ఇవీ చూడండి.. ట్రైలర్: చావు కంటే నరకం ప్రేమించడం

ABOUT THE AUTHOR

...view details