'బంగారం' చిత్రంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో నటించి మెప్పించిన నటిమీరా చోప్రా. ప్రస్తుతం ఈ అమ్మడు.. అక్షయ్ ఖన్నా, రిచా చద్దాలు కలిసి నటిస్తున్న 'ఆర్టికల్ 375' సినిమాలో అత్యాచార బాధితురాలి పాత్రలో కనిపించనుంది. అజయ్ భల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని పనోరమ స్టూడియోస్, టీ-సిరీస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
సినిమాలో అక్షయ్ క్రిమినల్ లాయర్ తరుణ్ సల్జాగా నటిస్తుండగా.. రిచా చద్దా పబ్లిక్ ప్రాసిక్యూటర్ హిరాల్ మోహతాగా కనిపించనుంది. బాధితురాలైన అంజలి డాంగిల్‌గా మీరా నటిస్తుంది.
"అక్షయ్, రిచాలు మంచి నటులు అన్న సంగతి తెలిసిందే. నేను వారితో పోటీపడి మరీ నటించాను. వారిద్దరి నుంచి నేను చాలా నేర్చుకున్నా. ఇలాంటి పాత్రలు అరుదుగా వస్తుంటాయి. అప్పుడే మనం మన నటనను ఆవిష్కరించే వీలుంటుంది. సినిమాలోని కోర్టు సన్నివేశాలు చాలా కీలకం. ఆ సమయంలో వారు నాకు చాలా సహాయపడ్డారు. ఇందులో అంజలి డాంగిల్ పాత్ర చాలా కీలకం".
-మీరా చోప్రా, హీరోయిన్
ఈ చిత్రంలో అతుల్ కులకర్ణి, రాహుల్‌భట్, కృతిక దేశాయి తదితర నటీనటులు నటిస్తున్నారు. సెప్టెంబర్ 13న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది .
ఇవీ చూడండి.. 'కవిత నీవే.. కథవు నీవే.. కనులు నీవే'