యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు తనను వేధిస్తున్నారని తెలిపింది నటి మీరా చోప్రా. సోమవారం నాడు అభిమానులతో ట్విట్టర్ చాట్‌లో పాల్గొన్న ఈ నటి తన ఫేవరెట్ హీరో ఎవరనే ప్రశ్నకు మహేశ్ బాబు అని సమాధానం చెప్పింది. "తారక్ గురించి చెప్పండి" అని ఓ నెటిజన్ అడగ్గా.. "నేను అతడి ఫ్యాన్ కాదు. అతడు నాకు తెలియదు" అని చెప్పింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తారక్ ఫ్యాన్స్ ఆమెపై ట్రోల్స్ వర్షం కురిపించారు. ఫలితంగా ఈ విషయంపై నేరుగా ఎన్టీఆర్కే ఫిర్యాదు చేసింది మీరా.
"తారక్.. నీ అభిమానులు నన్ను వేశ్య, పోర్న్ స్టార్ వంటి పదాలతో పిలుస్తారని అనుకోలేదు. కేవలం నీ కంటే మహేశ్ బాబునే ఎక్కువగా ఇష్టపడతానని నేను చెప్పడం వల్ల ఇలా అంటున్నారు. నీ అభిమానులు నా తల్లిదండ్రులకు కూడా ఇలాంటి అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నారు. ఇటువంటి అభిమానులతో మీరు సక్సెస్ సాధించినట్టు భావిస్తున్నారా? మీరు నా ట్వీట్‌ను పెడచెవిన పెట్టరని భావిస్తున్నా."