తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'రాజమౌళి చిత్రాల్లో నటించాలని ఉంది' - మానుషి చిల్లర్ తాజా వార్తలు

ప్రపంచ సుందరి, నటి మానుషి చిల్లర్.. దర్శకుడు రాజమౌళిపై ప్రశంసలు కురిపించింది. ఆయన సినిమాల్లో నటించాలని ఉందంటూ తన కోరికను వెల్లడించింది.

Manushi Chhillar On S.S. Rajamouli Films
'రాజమౌళి చిత్రాల్లో నటించాలని ఉంది'

By

Published : Oct 9, 2020, 6:09 PM IST

మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న అందగత్తె, నటి మానుషి చిల్లర్‌. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఈమె భారత్‌కు ప్రపంచ సుందరి కిరీటాన్ని తెచ్చిపెట్టింది. అలాంటి ఈ అమ్మడు తెలుగు దర్శకుడు రాజమౌళి సినిమాలో నటించాలని కోరుకుంటోంది. తాజాగా ఈమె.. రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి', 'మగధీర' చిత్రాలను వీక్షించిందట. ఈ సందర్భంగా జక్కన్న గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

మానుషి చిల్లర్

"రాజమౌళి ఈ కాలపు అత్యుత్తుమ చిత్రాలను తెరకెక్కించే దర్శకుల్లో అగ్రగణ్యుడు. ఆయన తీసిన చిత్రాల్లో మహిళ పాత్రలు చాలా అందంగా, హుందాగా ఉంటాయి. భారతీయ చలన చిత్రసీమకు గొప్ప గుర్తింపుతో పాటు ఆణిముత్యాల్లాంటి సినిమా తీశారు. అందుకే నేను ఆయనకు అభిమానిగా మారిపోయా. భవిష్యత్తులో ఆయన చేపట్టబోయే చిత్రాల్లో నటించడానికి చాలా కష్టపడి పనిచేస్తానని ఆశిస్తున్నా."

-మానుషి చిల్లర్, నటి

వైద్య విద్యను అభ్యసించిన మానుషి.. కూచిపూడి నృత్యకారిణి కూడా. ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్న చారిత్రక చిత్రం 'పృథ్వీరాజ్'‌లో నటిస్తోంది. ఇందులో పృథ్వీరాజ్‌ భార్య సన్యోగిత చౌహాన్‌ పాత్రలో కనిపించనుంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరనా వైరస్‌పై అవగాహన కల్పించే ప్రచార కార్యక్రమంలో అంతర్జాతీయ మిస్‌ వరల్డ్ ఫౌండేషన్‌ తరపున కూడా తనవంతుగా ప్రచారం చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details