తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Mani Ratnam: సినీ కొమ్మకు పూసిన ఓ ప్రేమపుష్పం! - మణిరత్నం పొన్నియన్​ సెల్వన్​

ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించి కుర్రకారు మదిలో ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించారు దర్శకుడు మణిరత్నం(Mani Ratnam). దక్షిణాది భాషల్లో పలు చిత్రాలను రూపొందించి విభిన్న శైలితో విశేషాదరణ దక్కించుకున్నారు. 'రోజా' సినిమాతో జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన మణిరత్నం.. నేడు 65వ పడిలో అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

Mani Ratnam Birthday
మణిరత్నం బర్త్​డే

By

Published : Jun 2, 2021, 5:35 AM IST

భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు మణిరత్నం(Mani Ratnam). సినిమాలు తెరకెక్కించడంలో ఆయన శైలే విభిన్నంగా ఉంటుంది. మణిరత్నం తీసిన ప్రేమకథా చిత్రాలు కుర్రకారు మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. దర్శకుడిగా తొలి కన్నడ చిత్రం 'పల్లవి అనూ పల్లవి'తో పురస్కారం అందుకుని కెరీర్​లో తన విజయాల పరంపరను ప్రారంభించారు. హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోని పలు చిత్రాలకూ ఆయన దర్శకత్వం వహించారు. తెలుగులో మణిరత్నం రూపొందించిన తొలి చిత్రం 'గీతాంజలి' బాక్సాఫీస్‌ వద్ద రికార్డులను తిరగరాయడం సహా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది.

ఆ తర్వాత 'రోజా' సినిమాతో ప్రేమికుల మనసు దోచేశారు మణిరత్నం. దేశవ్యాప్తంగా అనేక భాషల్లో ఈ చిత్రం విడుదలై.. విశేష ప్రేక్షాకాదరణ దక్కించుకుంది. ఈ సినిమా ఆయనకు జాతీయస్థాయి గుర్తింపు తీసుకొచ్చింది. మణిరత్నం ప్రేమ కథలను దేశానికి పరిచయం చేసి అఖండ విజయం నమోదు చేసిన చిత్రమది. మరోవైపు దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తీసిన 'గాయం' చిత్రానికి కథ రాసిందీ మణిరత్నమే. 'బొంబాయి' చిత్రంతో మంచి మెలోడీ హిట్టందుకున్నారు. 'తాజ్‌ మహల్‌' లాంటి ఎన్నో చిత్రాలకు కథ రాసి ప్రేక్షకుల మనసులో గుర్తుండిపోయారు.

వ్యక్తిగతం

మణిరత్నం అసలు పేరు గోపాల రత్నం సుబ్రహ్మణ్యం. 1956 జూన్​ 2న తమిళనాడులోని మధురైలో జన్మించారు మణిరత్నం. సినిమాలపై ఆసక్తితో చదువు మధ్యలోనే ఆపేసి సినిమాలకు సంబంధించిన కోర్సును తీసుకున్నారు. ఆ తర్వాత అనేక చిత్రాలకు పనిచేసి.. 'పల్లవి అను పల్లవి' అనే కన్నడ సినిమాకు తొలిసారి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత తమిళ, మలయాళ, తెలుగు భాషలతో పాటు హిందీలోనూ సినిమాలను రూపొందించారు. 1988లో నటి సుహాసిని(mani ratnam suhasini)ని వివాహమాడారు.

ప్రతిష్ఠాత్మకంగా..

మణిరత్నం ప్రస్తుతం రూపొందుతోన్న భారీ బడ్జెట్‌ చిత్రం 'పొన్నియన్‌ సెల్వన్‌'(ponniyin selvan). 2019 డిసెంబర్‌లోనే థాయ్‌లాండ్​లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఆ తర్వాత కరోనా కారణంగా చిత్రీకరణ‌ వాయిదా పడింది. అయితే ఈ ఏడాదిజులై లేదా ఆగస్టులో చిత్ర ఫస్ట్​లుక్​ను విడుదల చేసే అవకాశం ఉంది. మద్రాస్‌ టాకీస్‌, లైకా ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ బచ్చన్, విక్రమ్, త్రిష, జయం రవి, కార్తీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జయరామ్‌, శోభిత ధూళిపాళ్ల, శరత్‌ కుమార్, ప్రకాశ్​రాజ్‌, ప్రభు, ఐశ్వర్య లక్ష్మి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

పురస్కారాలు

2002లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో దర్శకుడు మణిరత్నాన్ని సత్కరించింది. ఇప్పటి వరకు ఈయన ఆరు జాతీయ అవార్డులను కైవసం చేసుకున్నారు. ఎన్నో ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాలను అందుకున్నారు.

ఇదీ చూడండి:'పొన్నియన్ సెల్వన్' షూటింగ్​ వాయిదా?

ABOUT THE AUTHOR

...view details