తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మణిరత్నం ఆస్పత్రిలో చేరారన్న వార్తలు వదంతులే!' - అనారోగ్యం

ప్రముఖ దర్శకుడు మణిరత్నం.. సాధారణ వైద్య పరీక్షల అనంతరం సురక్షితంగా ఇంటికి చేరారు. గుండె సంబంధిత సమస్యలతో మణిరత్నం ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. ఈ వదంతులను ఖండిస్తూ ఆయన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

'మణిరత్నం ఆస్పత్రిలో చేరారన్న వార్తలు వదంతులే!'

By

Published : Jun 18, 2019, 8:30 AM IST

ప్రముఖ దర్శకుడు మణిరత్నంకు అనారోగ్యం.. అన్న వార్తలను ఖండిస్తూ ఆయన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మణిరత్నం గుండె సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేరారన్న వార్తలు వదంతులు మాత్రమేనని స్పష్టం చేసింది.

సాధారణ వైద్య పరీక్షల కోసమే దర్శకుడు వచ్చారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన గతంలో గుండె పోటుతో ఆస్పత్రిలో చేరారు.

ప్రస్తుతం మణిరత్నం తమిళంలో ‘'పొన్నియన్‌ సెల్వన్‌'’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తమిళనాడుకు చెందిన రాజు.. రాజ రాజ చోళన్‌ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకొంటుంది. ఇందులో అమితాబ్‌ బచ్చన్, ఐశ్వర్యరాయ్, విక్రమ్, అమలాపాల్, కార్తి, అనుష్క శెట్టి, కార్తీ, జయం రవి తదితరులు నటిస్తున్నారు.

ఇదీ చూడండి: 'విరాట పర్వం'లో నక్సలైట్​గా రానా..!

ABOUT THE AUTHOR

...view details