బాలీవుడ్ ప్రముఖ నటి, ఫిట్నెస్ భామ మందిరా బేడీ.. నాలుగేళ్ల ఓ పాపను దత్తత తీసుకుంది. జులైలో ఈ చిన్నారిని దత్తత తీసుకున్నట్లు ఇన్స్టా వేదికగా వెల్లడించింది. ఈ పాప దైవకృపతో తమకు దక్కిందని పేర్కొంది.
దర్శకుడు రాజ్ కౌశల్, నటి మందిరకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఈ సందర్భంగా దత్తత తీసుకున్న అమ్మాయిని పరిచయం చేస్తూ మందిర ఇన్స్టాలో ఫ్యామిలీ ఫొటో పోస్ట్ చేసింది.