తాను సంప్రదాయాలను ఎక్కువగా గౌరవిస్తుంటానని నటుడు మంచు విష్ణు తెలిపారు. అందుకే పార్టీలకు దూరంగా ఉంటానని చెప్పారు. తన తదుపరి చిత్రం 'మోసగాళ్లు' ప్రమోషన్‌లో పాల్గొన్న విష్ణు తన వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలు పంచుకున్నారు.
"లక్ష్మి, నేను, మనోజ్.. మా ముగ్గురిలో సంప్రదాయాలకు నేనే ఎక్కువగా విలువ ఇస్తుంటాను. పెద్దా, చిన్నా అనే పద్ధతులు నమ్ముతుంటాను. నేను కొంచెం బోరింగ్ పర్సన్. రాత్రి త్వరగా నిద్రపోవడం. ఉదయాన్నే నిద్రలేవడం.. ఇలా ఉంటుంది నా లైఫ్‌స్టైల్. కానీ వాళ్లిద్దరి లైఫ్‌స్టైల్ వేరేలా ఉంటుంది. వాళ్లిద్దరి ఆలోచనలు కొంచెం కలుస్తుంటాయి. దాంతో వాళ్లిద్దరూ స్నేహితులు, పార్టీలతో ఎంజాయ్ చేస్తుంటారు. నా దృష్టిలో ఎంజాయ్‌మెంట్ అంటే పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం, పిల్లలతో సమయాన్ని గడపడం."
- మంచు విష్ణు, కథానాయకుడు