మంచు మనోజ్ హీరోగా 'అహం బ్రహ్మాస్మి' చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను బుధవారం సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశాడు మనోజ్. ఎంఎం ఆర్ట్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి.. పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. క్రైమ్, కామెడీ, యాక్షన్ కథాంశాలను మెళవించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ట్విట్టర్లో ప్రకటించాడీ హీరో.
'అహం బ్రహ్మాస్మి' అంటున్న మంచు మనోజ్ - మంచు మనోజ్ మూవీ అప్డేట్స్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కొంత కాలం విరామం తర్వాత మళ్లీ 'అహం బ్రహ్మాస్మి'తో రీఎంట్రీ ఇస్తున్నాడు. పాన్ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను బుధవారం విడుదల చేసింది చిత్రబృందం.
'నేనే దేవుడ్ని' అంటున్న మంచు మనోజ్
'అహం బ్రహ్మాస్మి' పేరుతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కతోంది. మనోజ్, తన తల్లి నిర్మలాదేవి సినిమాను నిర్మిస్తున్నారు. మార్చి 6న ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఈ చిత్రం దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానుంది.
ఇదీ చూడండి.. పాన్ ఇండియా సినిమాతో మనోజ్ రీఎంట్రీ