Manchu Manoj Corona: సినీనటుడు మంచు మనోజ్ కొవిడ్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. తనతో సన్నిహితంగా ఉన్నవారు టెస్టులు చేయించుకుని జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు.
వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పిన మనోజ్.. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తెలిపారు.
ప్రస్తుతం మనోజ్.. 'అహం బ్రహ్మస్మి'(aham brahmasmi movie) అనే సినిమాలో నటిస్తున్నారు. కొవిడ్ కారణంగా కొద్ది రోజులపాటు ఈ సినిమా చిత్రీకరణ నిలిచిపోయింది.