హైదరాబాద్లో ఇబ్బందులు పడుతున్న వలస కూలీలను క్షేమంగా స్వస్థలాలకి పంపించే బాధ్యతను భుజాన వేసుకున్నారు కథానాయకుడు మంచు మనోజ్. ఉపాధి లేక, స్వస్థలాలకి చేరుకోలేక కూలీలు ఇబ్బంది పడుతున్న విషయం మనోజ్ దృష్టికి రావడం వల్ల ఆయన రెండు బస్సుల్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని మూసాపేట నుంచి శ్రీకాకుళంకి ఆ బస్సులు బయల్దేరాయి.
వలస కూలీలను ఇంటికి చేర్చిన మంచు మనోజ్
హైదరాబాద్లో వలస కూలీలను తమ స్వస్థలాలకు పంపించే బాధ్యత కథానాయకుడు మంచు మనోజ్ తీసుకున్నారు. మూసపేట నుంచి శ్రీకాకుళానికి రెండు బస్సులను ఏర్పాటు చేయించి.. వారికి ఆహారంతో పాటు మాస్క్‌లు, శానిటైజర్లు అందజేశారు.
వలస కూలీలకు బస్సులు ఏర్పాటు చేసిన మనోజ్
ఈ సందర్భంగా మనోజ్ కూలీలకు అవసరమైన ఆహారంతోపాటు మాస్క్‌లు, శానిటైజర్లు అందజేశారు. కూలీలు ఇళ్లకి చేరేంతవరకు అవసరమైన అన్ని సౌకర్యాల్ని ఏర్పాటు చేసినట్టు మనోజ్ బృందం తెలిపింది. గురువారం నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకి చెందిన కూలీలను వాళ్ల ఊళ్లకి బస్సుల్లో పంపించేందుకు ఏర్పాట్లు చేసినట్టు మంచు మనోజ్ తెలిపారు. బుధవారం ఆయన పుట్టినరోజు.
ఇదీ చూడండి.. చిరంజీవి నేతృత్వంలో టాలీవుడ్ సమావేశం!