బాలీవుడ్ జోడీ మలైకా అరోరా, అర్బాజ్ ఖాన్.. 2017లో న్యాయపరంగా విడాకులు తీసుకున్నారు. అయితే ఆ తర్వాత ఈ విషయం గురించి ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు. కానీ ఇటీవలే కరీనా కపూర్ రేడియో షో 'వాట్ ఉమెన్ వాంట్'లో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించింది మలైకా. డైవోర్స్ తీసుకునే సమయంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తుచేసుకుంది. తొలుత తన కుటుంబసభ్యులు.. ఈ విషయంపై మరోసారి ఆలోచించమన్నారని చెప్పింది.
"ఈ విషయంలో ఎవరైనా సరే ముందు వద్దనే చెప్తారు. నాకు అలానే జరిగింది. విడాకులు తీసుకునే ముందురోజు రాత్రి.. నువ్వు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా? అని నా కుటుంబ సభ్యులు అడిగారు. మరోసారి ఆలోచించుకోమని చెప్పారు. నేను అనుకున్నదే చెబితే, వారందరూ నాకు అండగా నిలిచారు. మనం తీసుకోనే ఓ నిర్ణయం మన జీవితాన్ని సులభంగా సాగనివ్వదు. చివరికి కొంతమందితో నిందలు పడాల్సినా పరిస్థితులు తీసుకొస్తుంది. అయితే మన కోసం, చూట్టూ ఉండేవారి కోసం ఇదే సరైనదని భావించే నేను, అర్భాజ్ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం"
-- మలైకా అరోరా, నటి