బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'బెల్ బాటమ్'. ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజుల నుంచి జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా దీనిపై స్పందించిన ఈ చిత్ర నిర్మాణ సంస్థ పూజా ఎంటర్టైన్మెంట్స్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇవన్నీ అవాస్తమని స్పష్టం చేసింది. సినిమాకు సంబంధించిన ఏ విషయమైనా తాము సరైన సమయంలో ప్రకటిస్తామని చెప్పింది. వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని సూచించింది.
అక్షయ్ 'బెల్ బాటమ్' ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ - OTT release bell bottom
బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ నటించిన 'బెల్ బాటమ్' చిత్రం ఓటీటీలో విడుదల కానున్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపారేసింది చిత్ర నిర్మాణ సంస్థ. సినిమాకు సంబంధించిన ఏ విషయమైనా తాము అధికారికంగా ప్రకటించేవరకు పరిగణలోకి తీసుకోవద్దని సూచించింది.
బెల్‌బాటమ్
స్పై-థ్రిల్లర్ కథతో రూపొందుతోన్న 'బెల్ బాటమ్'కు రంజిత్ ఎమ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. వాణీ కపూర్, హ్యుమా ఖురేషీ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
ఇదీ చూడండి: కరోనా కట్టడికి అక్షయ్, ట్వింకిల్ సాయం
Last Updated : May 1, 2021, 8:32 PM IST