తెలుగు తెరపై విజయవంతంగా దూసుకెళ్తోన్న చిత్రం ‘మజిలీ’. పెళ్లి తర్వాత నాగచైతన్య - సమంత తొలిసారి జంటగా ఈ చిత్రంలో నటించారు. శివ నిర్వాణ దర్శకుడు. భావోద్వేగం, ప్రేమ ప్రయాణం కలగలిపిన చిత్రం కావడం వల్ల ప్రేక్షకులను బాగా అలరిస్తోంది మజిలీ. భగ్నప్రేమికుడిగా తొలిభాగంలో చైతూ చూపిన నటన.. భర్త మనసుకు తగిలిన గాయాన్ని ప్రేమతో మాన్పించాలని చూసే భార్యగా సమంత అభినయం ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ చిత్రం వచ్చి మూడు వారాలు గడుస్తున్నా.. మంచి వసూళ్లతో పరుగెడుతోంది.
'మజిలీ' ముగింపు దొరికేసింది.. - శివ నిర్వాణ
టాలీవుడ్ జంట నాగచైతన్య, సమంత నటించిన చిత్రం మజిలీ. ఈ చిత్రంలో తొలగించిన ఓ సన్నివేశం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ డిలీటెడ్ సన్నివేశాన్ని చిత్ర బృందం బయటకు వదిలింది. ‘మజిలీ’లో ప్రతినాయకుడిగా కనిపించిన సుబ్బరాజు పాత్రకు ముగింపు చూపించలేదు. ఫలితంగా చివర్లో ఆ పాత్ర తేలిపోయినట్లయింది. కానీ... దీనికి ఓ చక్కటి ముగింపునిచ్చారని తాజాగా విడుదలైన డిలీటెడ్ సీన్‌లో చూపించారు.
కత్తితో పొడవాలని కసితో ఎదురు చూసే శత్రువును.. మనస్ఫూర్తిగా మదికి హత్తుకోవడం ద్వారా అతనిలో మార్పు తీసుకురావచ్చని శివ నిర్వాణ చక్కని సన్నివేశం రూపొందించారు. ఈ తాజా వీడియోలో సంభాషణలు అంత స్పష్టంగా లేవు. కానీ మనసుకు హత్తుకునేలా చైతూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది.