తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మహేశ్​ కొత్త సినిమా ప్రారంభం ఎప్పుడంటే..? - మహర్షి

మహేశ్​బాబు-అనిల్ రావిపూడి కాంబినేషన్​లో తెరకెక్కనున్న సినిమా మే 31న అధికారికంగా ప్రారంభం కానుంది. రష్మిక మందణ్న హీరోయిన్​గా, విజయశాంతి కీలక పాత్రలో కనిపించనున్నారు.

మహేశ్​ కొత్త సినిమా ప్రారంభం ఎప్పుడంటే..!

By

Published : May 26, 2019, 7:49 PM IST

ఇటీవలే 'మహర్షి'తో ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్నాడు హీరో మహేశ్​బాబు. తర్వాతి చిత్రం అనిల్ రావిపూడితో చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ విషయం తెలిసింది. సూపర్​స్టార్ కృష్ణ పుట్టిన రోజైన మే 31న అధికారికంగా ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు.

మహేశ్​బాబు- అనిల్ రావిపూడి

కామెడీ చిత్రాలు తీయడంలో అనిల్ రావిపూడి సిద్ధహస్తుడు. ఇప్పటికే పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2 వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఇప్పుడు మహేశ్​బాబుతో పంచ్​ డైలాగులు చెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. రష్మిక మందణ్న హీరోయిన్​గా నటించనుంది. సీనియర్ నటులు రమ్యకృష్ణ, విజయశాంతి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దిల్​రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఇది చదవండి: ప్రపంచకప్​ కోసం ఇంగ్లాండ్​కు చిన్నోడు, పెద్దోడు

ABOUT THE AUTHOR

...view details