తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఎదురుచూపులన్నీ సూపర్‌స్టార్‌ మహేశ్​ కోసమే - మహేశ్​బాబు కొత్త సినిమా

భారత్​లో ప్రస్తుతం అత్యధికులు ఎదురు చూస్తున్న చిత్రంగా 'సరిలేరు నీకెవ్వరు' నిలిచింది. ప్రఖ్యాత మూవీ రేటింగ్స్ సంస్థ ఐఎమ్​డీబీ ఈ జాబితాను ప్రకటించింది.

సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేశ్​బాబు

By

Published : Nov 25, 2019, 11:25 PM IST

సూపర్​స్టార్ మహేశ్​బాబు నటిస్తున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఇటీవలే విడుదలైన టీజర్​.. వ్యూస్​లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అంతే కాకుండా అత్యధిక మంది భారతీయ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమా ఇదేనని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మూవీ రేటింగ్స్‌ సంస్థ ఐఎమ్‌డీబీ ప్రకటించింది.

ప్రస్తుతం భారత్​లో అత్యధిక మంది ఎదురు చూస్తున్న సినిమాగా 'సరిలేరు నీకెవ్వరు' ప్రథమ స్థానంలో నిలిచింది. పాన్‌ ఇండియా సినిమాలు 'దబాంగ్‌', 'దర్బార్‌', 'పానిపట్‌'లను వెనక్కినెట్టి 41.5 శాతం ఓట్లతో ఈ ఘనత సాధించటం విశేషం.

ఈ సినిమాలో మేజర్​గా కనిపించనున్నాడు మహేశ్​బాబు. అనిల్ రావిపూడి దర్శకుడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ABOUT THE AUTHOR

...view details