సూపర్‌స్టార్ మహేశ్‌బాబు మళ్లీ సంక్రాంతి లక్ష్యంగా రంగంలోకి దిగుతున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ చేయబోతున్న కొత్త సినిమా.. వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఈసారి పండక్కి 'సరిలేరు నీకెవ్వరు' అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడీ కథానాయకుడు. ఆ చిత్రం విజయాన్ని అందుకుంది.
మరోసారి సంక్రాంతి బరిలో మహేశ్‌బాబు - entertainment news
హీరో మహేశ్‌బాబు కొత్త చిత్రం వేసవిలో షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు
పండగ సందర్భంగా సినిమాలు వస్తే ఆ ఉత్సాహమే వేరుగా ఉంటుంది. వసూళ్లు అదిరిపోయే స్థాయిలో ఉంటాయి. అందుకే మళ్లీ పండగనే లక్ష్యంగా చేసుకున్నాడు మహేశ్. కొత్త చిత్రాన్ని వేసవిలో ఆరంభిస్తారని సమాచారం. మహేశ్ సరసన కియారా అడ్వాణీ నటించబోతోంది. మరో నాయికకీ స్థానముంది. ప్రస్తుతం మహేశ్.. అమెరికాలో సెలవుల్ని ఆస్వాదిస్తున్నాడు. తిరిగి రాగానే కొత్త చిత్రం పనులతో బిజీ కాబోతున్నాడు.
Last Updated : Feb 28, 2020, 11:29 PM IST