సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన సినిమా 'మహర్షి'. రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మహేశ్ 25వ చిత్రం కావడం.. మూడు విభిన్న లుక్స్‌లో ప్రిన్స్ కనిపించనుండటం.. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది.
విభిన్న పాత్రల 'మహర్షి' వచ్చేది రేపే - పూజా హెగ్డే
ప్రిన్స్ మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న 'మహర్షి' రాకకు సర్వం సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానుంది. హీరోయిన్గా పూజా హెగ్డే కనిపించనుంది.
విభిన్న పాత్రల 'మహర్షి' వచ్చేది రేపే
పూజా హెగ్డే హీరోయిన్గా, అల్లరి నరేశ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. దిల్‌రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రం సినీ అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి.
"మహేశ్‌బాబు కెరీర్లో ఇది ఓ ల్యాండ్ మార్క్ సినిమా అవుతుంది. వంశీ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరిగా నిలవబోతున్నాడు. చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరూ తమ శక్తి మేర నటించి ఓ మ్యాజిక్ క్రియేట్ చేశారు." -దిల్‌రాజు, చిత్ర నిర్మాత