కోలీవుడ్ అగ్రహీరో విక్రమ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'మహావీర్ కర్ణ'. శుక్రవారం అతడి పుట్టినరోజు సందర్భంగా అభిమానుల కోసం ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఆర్.ఎస్. విమల్ దర్శకత్వం వహిస్తున్నాడు. న్యూయార్క్‌కు చెందిన యునైటెడ్ ఫిల్మ్ కింగ్‌డమ్ నిర్మాణ సంస్థ.. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తుంది. సురేశ్ గోపీ దుర్యోధనుడి పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాలోని మిగిలిన నటీనటుల వివరాలు వెల్లడించాల్సి ఉంది.
కర్ణుడిగా విల్లు ఎక్కుపెట్టిన చియాన్ విక్రమ్
విక్రమ్ హీరోగా 'మహావీర్ కర్ణ' సినిమా తీస్తున్నారు. శుక్రవారం అతడి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఇందులో చియాన్.. కర్ణుడి వేషధారణలో ఆకట్టుకున్నాడు.
విక్రమ్
ఈ వీడియోలో విక్రమ్.. కర్ణుడి వేషధారణలో యోధుడిలా దర్శనమిచ్చాడు. దీనితో పాటే చియాన్ చేతిలో మరో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో మణిరత్నం తీస్తున్న 'పొన్నియిన్ సెల్వన్' ఒకటి. దీనిని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు.
ఇదీ చూడండి : 'రీఎంట్రీలో చోటు దక్కడం ధోనీకి కష్టమే'