'మహర్షి' సినిమాలో "రైతు" మనసులో మాట - మహర్షి
ఇటీవలే విడుదలైన 'మహర్షి' సినిమాలో రైతు పాత్రలో ఆకట్టుకున్నారు కర్నూలుకు చెందిన గురుస్వామి. సినిమా షూటింగ్లో తన అనుభవాల్ని ఈటీవీ భారత్తో పంచుకున్నారు.
'మహర్షి' సినిమాలో రైతు మనసులో మాట
వ్యవసాయంలో తనకెలాంటి అనుభవం లేకపోయినా రైతు పాత్రలో జీవించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు కర్నూలు జిల్లాకు చెందిన విశ్రాంత బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి గురుస్వామి. 'మహర్షి' చిత్రంలో కీలకమైన రైతు పాత్రలో కనిపించిన ఆయన... తనకు ఈ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఇంకా మరెన్నో విషయాల్ని ఈటీవీ భారత్తో పంచుకున్నారు.