కరోనా ప్రభావం అన్ని విభాగాలతో పాటు సినీ రంగంపైనా తీవ్రంగా పడింది. కొన్నాళ్ల నుంచి థియేటర్లు మూసివేయడం చాలా వరకు సినిమాలు ఓటీటీల్లోనే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. అయితే ప్రస్తుతమున్న కొవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం మెల్లమెల్లగా క్షీణిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర, దిల్లీ వంటి రాష్ట్రాలు అన్లాక్పై దృష్టిసారిస్తున్నాయి. ఈ క్రమంలోనే థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతులిస్తున్నాయి.
CORONA: సోమవారం నుంచి సినిమా థియేటర్లు ఓపెన్ - మహారాష్ట్ర థియేటర్స్ ఓపెన్
సినిమా థియేటర్లకు 50 శాతం సామర్ధ్యంతో తెరుచుకోవచ్చని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సోమవారం నుంచి ఇది అమల్లోకి రానుంది.
సినిమా థియేటర్లు
రాష్ట్రంలో థియేటర్లు తెరుచుకోవచ్చని మహారాష్ట్ర సర్కారు.. శనివారం ఓ ప్రకటన జారీ చేసింది. దీంతో సోమవారం నుంచి అక్కడ 50 శాతం సామర్ధ్యంతో సినిమా హాళ్లు తెరుచుకోనున్నాయి. ఈ బాటలోనే త్వరలో మిగతా రాష్ట్రాలు కూడా థియేటర్లకు అనుమతులిచ్చే అవకాశముంది.
ఇది చదవండి:అన్లాక్పై రాష్ట్రాల దృష్టి- అక్కడ ఐదంచెల వ్యూహం!