కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న క్రమంలో నీట్ పరీక్ష నిర్వహించడంపై కోర్టులను తప్పుబట్టారు కోలీవుడ్ నటుడు సూర్య. ఈ వ్యాఖ్యలపై కోర్టు ధిక్కార చర్య కింద హీరో మీద చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎం. సుబ్రహ్మణ్యం. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏ.పి సహికి లేఖ రాసినట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
'సూర్యపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాల్సిందే'
కోలీవుడ్ నటుడు సూర్యపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విన్నవించారు జస్టిస్ ఎస్.ఎం.సుబ్రహ్మణ్యం. ఈ విషయంలో హీరోపై తగిన చర్యలు తీసుకోవాలంటూ చీఫ్ జస్టిస్ ఏ.పి.సహికి లేఖ రాశారు. కరోనా సమయంలో నీట్ పరీక్ష నిర్వహించడంపై కోర్టులను తప్పుబడుతూ సూర్య ఇటీవలే స్పందించారు.
సూర్యపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలంటూ వినతి
తమిళనాడులోని ముగ్గురు నీట్ విద్యార్థుల ఆత్మహత్యపై నటుడు సూర్య ఇటీవలే స్పందించారు. "ప్రాణాంతక కరోనా వైరస్ భయంతో.. కోర్టులు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా తీర్పులు చెబుతున్నాయి. కానీ, విద్యార్థులు నిర్భయంగా వెళ్లి పరీక్షలు రాయమని ఎలా ఆదేశిస్తున్నారు" అని ట్విట్టర్లో నటుడు సూర్య ప్రశ్నించారు.