నటుడు మాధవన్ గురించి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రొమాంటిక్ హీరో, దర్శకుడు, విలన్‌గా, విభిన్న పాత్రలు చేస్తూ కెరీర్లో దూసుకెళ్తున్నారు. ఇప్పుడు ఆయన మరోసారి ప్రతినాయకుడిగా అలరించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.
చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమాల్లో 'లూసిఫర్' రీమేక్ 'గాడ్‌ఫాదర్' ఒకటి(chiranjeevi lucifer remake). ఇటీవల షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ చిత్రంలోనే మాధవన్ విలన్‌గా కనిపించనున్నారంటూ జోరూగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే చర్చలు కూడా జరిగాయని మాధవన్ గ్రీన్‌సిగ్నల్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. ఇప్పటికే మాధవన్.. నాగచైతన్య 'సవ్యసాచి', అనుష్క 'నిశబ్దం'లో విలన్‌గా నటించి మెప్పించారు.