అక్కినేని హీరో నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న రొమాంటిక్ చిత్రం 'లవ్‌స్టోరీ'. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. కరోనా వైరస్ ముందే సినిమా చిత్రీకరణ చాలా వరకు పూర్తి చేసుకుంది. తాజాగా లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం ఈ నెల 7న చిత్రబృందం షూటింగ్ మళ్లీ ప్రారంభించింది. సినిమా షూటింగ్‌ను పదిహేను రోజుల్లో ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేయాలని చిత్రబృందం అనుకుంటోంది. తాజాగా చిత్రానికి సంబంధించిన ఓ అందమైన బహుమతిని ప్రేక్షకులకు ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట.
'లవ్‌స్టోరీ' నుంచి ఆరోజు సర్ప్రైజ్! - లవ్‌స్టోరీ టీజర్
అక్కినేని వారసుడు నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'లవ్‌స్టోరీ'. లాక్‌డౌన్ తర్వాత ఇటీవలే షూటింగ్‌ను పునఃప్రారంభించుకుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
విషయం ఏమిటంటే.. ఈ నెల 20 అక్కినేని నాగేశ్వరరావు జయంతి. ఈ సందర్భంగా మనవడి 'లవ్‌స్టోరి' చిత్రానికి సంబంధించిన పాట లేదా టీజర్ విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. దర్శకుడు శేఖర్ కమ్ముల మాత్రం చిత్రాన్ని సాధ్యమైనంత వరకు త్వరగా పూర్తి చేసి, ఈ ఏడాది చివర్లోపు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందు కసరత్తులు చేస్తున్నారట.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన 'ఏయ్ పిల్లా... పరుగున పోదామా' అంటూ సాగే ఈ చిత్రంలోని లిరికల్ వీడియో గీతాన్ని విడుదల చేశారు. ఇది శ్రోతల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని తదితరులు నటిస్తున్నారు.