తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మాస్టర్'‌ దర్శకుడితో ప్రభాస్‌ చిత్రం! - లోకేష్ కనగరాజ్

'ఖైదీ', 'మాస్టర్​' వంటి విజయవంతమైన చిత్రాలతో దూసుకెళ్తున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్​.. ప్రభాస్​తో సినిమా చేయనున్నారా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ఇప్పటికే కథ కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Lokesh Kanagaraj, a director who is on the cusp of a successful film, is saying yes to what he wants to do with Prabhas.
మాస్టర్‌ దర్శకుడితో ప్రభాస్‌ చిత్రం!

By

Published : Apr 4, 2021, 7:16 AM IST

ప్రభాస్‌ - లోకేష్‌ కనగరాజ్‌ కలయికలో సినిమాకి సన్నాహాలు మొదలయ్యాయా? - అవుననే అంటున్నాయి తమిళ సినీ వర్గాలు. 'ఖైదీ', 'మాస్టర్‌' చిత్రాలతో వరుస విజయాలు సొంతం చేసుకున్న దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌. ఆయన ప్రస్తుతం కమల్‌హాసన్‌తో 'విక్రమ్‌' అనే సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత ప్రభాస్‌తోనే చేయనున్నారని, అందుకోసం కథ సిద్ధమైనట్టు తెలుస్తోంది.

ప్రభాస్‌ ప్రస్తుతం 'ఆదిపురుష్‌', 'సలార్‌' చిత్రాలు చేస్తున్నారు. ఆ తర్వాత నాగ్‌ అశ్విన్‌తో సినిమా చేస్తారు. ఈ మూడు సినిమాల తర్వాత ప్రభాస్‌ - లోకేష్‌ కనగరాజ్‌ కలయికలో సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నట్టు తెలిసింది. ప్రభాస్‌ 'బాహుబలి', 'సాహో' చిత్రాలతో దేశవ్యాప్తంగా అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నారు. అందుకే ఆయనతో సినిమా చేయడం కోసం అన్ని సినీ పరిశ్రమల నుంచి దర్శకులు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు.

ఇదీ చదవండి:దీక్షా సింగ్​.. మోడల్​ నుంచి రాజకీయాల్లోకి

ABOUT THE AUTHOR

...view details