తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Puri Musings: బతికితే డేంజరస్​గా బతకాలి - పూరీ మ్యూజింగ్స్ తాజా ఎపిసోడ్

'పూరీ మ్యూజింగ్స్' ద్వారా అనేక అంశాలపై మాట్లాడుతూ తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు దర్శకుడు పూరీ జగన్నాథ్. తాజాగా ఆయన 'లివ్ డేంజరస్లీ' అనే టాపిక్​ గురించి వివరించారు.

puri
పూరీ

By

Published : May 31, 2021, 4:04 PM IST

"నీ జీవితం ఎలా ఉంది?" అని ఎదుటివారిని అడిగితే.. "ఏదో జీవితం అలా వెళ్లిపోతుంది కాలంతోపాటు నేను అలా సాగిపోతున్నా" అని అందరూ చెబుతుంటారు. ఇది మనం తరచూ వింటూనే ఉంటాం. కానీ, తాజాగా పూరీ జగన్నాథ్‌.. ఒక మనిషి ఎలా జీవించాలి అనే దాని గురించి 'పూరీ మ్యూజింగ్స్‌' వేదికగా వివరించారు. జీవితమంటే ఎప్పుడూ ఒకేలా ఉండకూడదని.. ముఖ్యంగా తరచూ సవాళ్లు ఎదుర్కోవాలని ఆయన అన్నారు. 'లివ్‌ డేంజరస్లీ' గురించి ఆయన ఏమన్నారంటే..

రాజముడి రైస్​ గురించి పూరీ మాటల్లో!

"లివింగ్‌ డేంజరస్లీ ఈజ్‌ ది ఓన్లీ వే అని ఎంతోమంది చెప్పారు. సవాళ్లు లేని జీవితాన్ని కోరుకోవద్దు. సెక్యురిటీ ఇవ్వమని జీవితాన్ని అడగవద్దు. ఎలాంటి ఎత్తుపల్లాలు లేని సాధారణ మైదానంలో బతుకుదామనుకుంటారు అందరూ. కానీ, జీవితంలో ఎత్తైన కొండలు, పర్వతాలు అనేవి ఉండాలి. రిస్క్‌ తీసుకోవడం.. రిస్క్‌లోకి దూకడమే మన క్యారెక్టర్‌ అవ్వాలి. చేసే పనులేప్పుడూ ఒకే విధంగా ఉండకూడదు. అలా ఉంటే బోరింగ్‌గా ఉంటుంది. జీవితం అనే కొవ్వొత్తిని రెండు వైపులా వెలిగించేద్దాం. ఇలాంటి ఆలోచనా విధానం మనిషికి అవసరం.

జీవితాన్ని ఎప్పుడూ దూరం నుంచి చూడొద్దు. జీవితం అనే పోటీలో పాల్గొనాలి. జీవితమంటే మనం మాత్రమే కాదు.. మన చుట్టూ ఎంతోమంది ఉంటారు. వాళ్లందర్నీ చూడు.. వాళ్లకంటే డేంజరేస్‌గా ఏమైనా చేయగలవేమో ఆలోచించు. ఒక్కసారి ప్రయత్నించు చూడు. భయం దెయ్యం లాంటిది. అది చెప్పినట్లు అస్సలు వినొద్దు. ఆశల్ని, కలల్ని, ఫాలో అయిపో. జీవితమంటేనే ఎన్నో సాహసాలతో కూడుకున్నది. బతికితే డేంజరస్‌గానే బతకాలి. సాదాసీదాగా కాదు. అది మనకి వద్దు. లివ్‌ డేంజరస్లీ" అని పూరీ వివరించారు.

puri musings: ఆ దేశాల్లో మనశ్శాంతిగా బతకొచ్చు

ABOUT THE AUTHOR

...view details