తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఈ ఏడాది ట్విట్టర్​లో సందడంతా ఈ ట్వీట్స్​దే! - అత్యధిక లైక్స్ పొందిన ట్వీట్

ఈ ఏడాది అత్యధిక లైక్​లు, రీట్వీట్​లు పొందిన ట్వీట్ల జాబితాను విడుదల చేసింది ట్విట్టర్. అలాగే ఎక్కువగా వాడిన హ్యాష్​ ట్యాగ్​లను ప్రకటించింది.

List of most Liked, Retweeted tweets in 2020
ఈ ఏడాది ట్విట్టర్​లో సందడంతా ఈ ట్వీట్స్​దే!

By

Published : Dec 8, 2020, 4:54 PM IST

2020.. మరో కొద్ది రోజుల్లో ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ట్విట్టర్​లో అత్యధిక లైక్​లు, రీట్వీట్​లు, హ్యాష్​ట్యాగ్​లు పొందిన ట్వీట్స్​ను ప్రకటించింది ట్విట్టర్. 'ఈ ఏడాది ఇదీ జరిగింది' అనే పేరుతో వాటిని విడుదల చేసింది. అవేంటో చూద్దాం.

అత్యధిక రీట్వీట్​లు

ఫిబ్రవరిలో తమిళ స్టార్ హీరో విజయ్.. తన అభిమానులతో తీసుకున్న సెల్ఫీ ఫొటో ఎక్కువ రీట్వీట్​లు పొందిన ట్వీట్​గా నిలిచింది. నైవేలీలో ఈ ఫొటోను క్లిక్​మనిపించాడు విజయ్.

క్రీడల విషయానికొస్తే.. ప్రధాని మోదీకి ధోనీ ధన్యవాదాలు తెలిపిన ట్వీట్ అత్యధిక రీట్వీట్​లను సాధించింది. ధోనీ రిటైర్​మెంట్ ప్రకటించిన సమయంలో మోదీ అతడి సేవలకు ధన్యవాదాలు తెలుపుతూ ఓ ట్వీట్ చేశాడు. దానికి థ్యాంక్స్ చెబుతూ ధోనీ మరో ట్వీట్ చేశాడు. దీనికి క్రీడల విభాగంలో అత్యధిక రీట్వీట్​లు లభించాయి.

అత్యధిక లైక్​లు

అనుష్క ప్రెగ్నెన్సీ గురించి ఆమె భర్త, టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ ఈ ఏడాది అత్యధిక లైక్​లను దక్కించుకుంది. అలాగే ఇదే విషయాన్ని తెలుపుతూ అనుష్క చేసిన ట్వీట్ టాప్​-5లో చోటు సంపాదించింది.

ఎక్కువ మంది కోట్ చేసిన ట్వీట్

తనకు కరోనా సోకిన విషయాన్ని తెలియజేస్తూ అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్​ను ఎక్కువ మంది కోట్స్​తో రీట్వీట్ చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు. దీంతో ఇది ఎక్కువ కోట్స్ సాధించిన ట్వీట్​గా నిలిచింది.

అత్యధిక హ్యాష్​ట్యాగ్​లు (సినిమా)

ఈ ఏడాది ట్విట్టర్​లో అత్యధిక హ్యాష్​ట్యాగ్​లు వాడిన సినిమాల్లో 'దిల్​ బెచారా' (హిందీ), 'సూరారై పొట్రు' (తమిళం), 'సరిలేరు నీకెవ్వరు' (తెలుగు) నిలిచాయి.

క్రీడలు

ఈ ఏడాది క్రీడల విభాగంలో ఎక్కువ హ్యాష్​ట్యాగ్​లు లభించిన అంశాల్లో 'ఐపీఎల్ 2020', 'విజిల్​ పొడు', 'టీమ్ఇండియా' ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details