టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. ఓటీటీ వైపు మొగ్గుచూపుతోందని తెలుస్తోంది. దర్శకుడు మారుతి పర్యవేక్షణలో రానున్న ఓ వెబ్ సిరీస్‌లో లావణ్య నటించనుందని టాక్. ఇప్పటికే చర్చలు కూడా జరిగాయని సమాచారం. అయితే ఈ సిరీస్‌కు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు.
వెబ్ సిరీస్‌లో లావణ్య త్రిపాఠి! - Lavanya Tripathi in Webseries
టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. దర్శకుడు మారుతి పర్యవేక్షణలో రానున్న ఓ వెబ్‌సిరీస్‌లో నటించనుందని టాక్. ప్రస్తుతం హీరో కార్తికేయతో 'చావు కబురు చల్లగా' సినిమాలో నటిస్తోందీ భామ.
వెబ్‌సిరీస్‌లో లావణ్య త్రిపాఠి
సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం లావణ్య.. హీరో కార్తికేయతో 'చావు కబురు చల్లగా' సినిమాతో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తోంది.