తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సింగిల్​ షాట్​' సినిమాతో హన్సిక సాహసం - 105 మినిట్స్ చిత్రం తాజా వార్తలు

కొత్త సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో '105 మినిట్స్​', 'స్టూవర్ట్​పురం దొంగ', 'రాజావిక్రమార్క', 'ఛత్రీవాలి' సినిమా విశేషాలు ఉన్నాయి.

latest movie updates
'105 మినిట్స్​' టీజర్

By

Published : Nov 5, 2021, 6:19 PM IST

కథానాయిక హన్సిక ఏకపాత్రాభినయం చేసిన చిత్రం '105 మినిట్స్​'(105 minutes movie release date). ఎడిటింగ్​ లేకుండా సింగిల్​ షాట్​లో కేవలం ఆరు రోజుల్లోనే రూపొందించిన చిత్రమిది. ఈ చిత్రం టీజర్​ను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్​ శుక్రవారం విడుదల చేశారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఈ చిత్రం టీజర్​ ఉంది. రాజు దుస్సా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకంపై బొమ్మన్​ శివ నిర్మించారు. తెలుగుతోపాటు దక్షిణాది భాషల్లో ఈ చిత్రం విడుదలకానుంది.

మరో పోస్టర్​..

'స్టూవర్ట్​పురం దొంగ' చిత్రం రెండో పోస్టర్
.

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న చిత్రం 'స్టూవర్ట్​పురం దొంగ'(Stuvartpuram donga new movie). దీపావళి సందర్భంగా ఫస్ట్​లుక్​ను చేయగా.. శుక్రవారం మరో పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో డిఫరెంట్​ లుక్​లో కనిపిస్తున్న బెల్లంకొండ హీరో.. సినీ ప్రియుల్ని ఆశ్చర్యపరిచారు. వీవీ వినాయక్ శిష్యుడు కేఎస్.. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్..

.

'ఆర్ఎక్స్ 100', 'గ్యాంగ్ లీడర్' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న యువహీరో కార్తికేయ కొత్త చిత్రం 'రాజా విక్రమార్క'(Raja vikramarka 2021 movie release date). ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిల్మ్​నగర్​లోని జేఆర్​సీ కన్వెన్షన్​లో శనివారం సాయంత్రం జరగనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ అలరిస్తోంది. శ్రీసారిపల్లి దర్శకుడు. నవంబర్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

రైజ్​ ఆఫ్ శ్యామ్..

.

నాని-సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా 'శ్యామ్​సింగరాయ్'(shyam singha roy release date). ఈ చిత్రంలో 'రైజ్​ ఆఫ్​ శ్యామ్​' అంటూ సాగే ఫుల్ లిరికల్ పాటను శనివారం ఉదయం 11గంటలకు విడుదల చేయనుంది చిత్రబృందం.

ఛత్రీవాలి షూటింగ్​ స్టార్ట్..

'ఛత్రీవాలి' షూటింగ్ స్టార్ట్​

రకుల్​ ప్రీత్​సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'ఛత్రీవాలి'(Chhatriwali movie news). ఈ చిత్రం షూటింగ్ శుక్రవారం ప్రారంభమైంది. సోషల్ కామెడీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తేజాస్ ప్రభా విజయ్​ డియోస్కార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇదీ చూడండి:'గ్లిజరిన్‌ లేకుండానే కన్నీళ్లు వచ్చేసేవి'

ABOUT THE AUTHOR

...view details