తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గాయని లతా మంగేష్కర్​ భవంతికి సీల్ - Lata Mangeshkar latest news

కొవిడ్ ముందు జాగ్రత్తల్లో భాగంగా ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ భవంతికి మున్సిపల్ అధికారులు సీల్ వేశారు. తామందరం బాగానే ఉన్నామని మంగేష్కర్ కుటుంబసభ్యులు తెలిపారు.​

Lata Mangeshkar's building gets sealed, singer and family safe
గాయని లతా మంగేష్కర్​ భవంతికి సీల్

By

Published : Aug 30, 2020, 3:24 PM IST

దిగ్గజ గాయని లతా మంగేష్కర్​ నివసిస్తున్న భవంతిని ముంబయి మున్సిపల్ అధికారులు సీల్ చేశారు. కరోనా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఇలా చేసినట్లు వెల్లడించారు. దక్షిణ ముంబయి పెద్దర్ రోడ్​లోని ప్రభుకుంజ్ బిల్డింగ్​లో ఉంటున్నారు లతా.

గాయని లతా మంగేష్కర్​

"నిన్న సాయంత్రం నుంచి 'ప్రభుకుంజ్'ను సీల్​ చేశారా? అంటూ విపరీతంగా ఫోన్లు వస్తున్నాయి. కరోనా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే దీనిని మూసివేశారు. ఇంట్లో వృద్ధులు ఉండటమే ఇందుకు కారణం. ఇటీవలే వినాయక చవితి సెలబ్రేషన్స్ కూడా భౌతిక దూరం పాటిస్తూనే జరుపుకొన్నాం" -మంగేష్కర్ కుటుంబం ప్రకటన

ఆ భవంతిలో కొందరికి కరోనా సోకిందని, అందువల్లే దానిని మూసివేశారని కొందరు అంటున్నారు. స్పందించిన మంగేష్కర్ కుటుంబసభ్యులు.. తామందరం ఆరోగ్యంగానే ఉన్నామని, అసత్య వార్తలు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details