'బిగ్ బాస్' ఫేమ్ మానస్ నాగులపల్లి హీరోగా నటించిన 'క్షీర సాగర మథనం' చిత్రానికి (ksheera sagara madhanam movie) అమెజాన్ ప్రైమ్లో అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్.. అక్షత సోనావని, చరిష్మా శ్రీకర్, ప్రదీప్ రుద్ర ఇతర ముఖ్య తారాగణంగా.. యువ ప్రతిభాశాలి అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందిన 'క్షీరసాగర మథనం' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర పిక్చర్స్‌తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ నిర్మించింది. ఆగస్టు 6న థియేటర్స్ లో విడుదలై.. కరోనా కారణంగా పరిమిత ఆదరణ పొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న అమెజాన్ ప్రైమ్లో (amazon prime) విడుదలై.. సంచలనం సృష్టిస్తూ ట్రేడ్ వర్గాలను విస్మయపరుస్తోంది.
'క్షీర సాగర మథనం'.. ప్రైమ్లో బంపర్ హిట్ - amazon prime
'బిగ్ బాస్ 5' పార్టిసిపెంట్ మానస్ నాగులపల్లి నటించిన "క్షీరసాగర మథనం" చిత్రానికి (ksheera sagara madhanam movie) అశేష స్పందన లభిస్తోంది. భారీ చిత్రాలను వెనక్కునెట్టి అమెజాన్ ప్రైమ్లో (amazon prime) రెండో స్థానంలో నిలిచిందీ చిత్రం.
ksheera sagara madhanam review
తమ చిత్రానికి అమెజాన్ ప్రైమ్లో లభిస్తున్న అపూర్వ స్పందన తమను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోందని దర్శకుడు అనిల్ పంగులూరి అంటున్నారు. ప్రైమ్లో 499వ చిత్రంగా విడుదలైన 'క్షీరసాగర మథనం' చిత్రం 'టక్ జగదీష్' తర్వాత రెండో స్థానంలో నిలవడం తమకు చాలా గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు.