తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సంజయ్.. కృతి భలేగా దర్శనమిచ్చారు కదా.. - kriti sanan first look

సంజయ్ దత్, అర్జున్ కపూర్, కృతి సనన్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తోన్న బాలీవుడ్ చిత్రం 'పానిపట్'. ఈ సినిమాలోని సంజయ్​ దత్, కృతి సనన్​ల లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం.

సంజయ్

By

Published : Nov 4, 2019, 2:03 PM IST

మూడవ పానిపట్‌ యుద్ధాన్ని కథాంశంగా చేసుకుని ప్రముఖ దర్శకుడు అశుతోష్‌ గోవరికర్‌ రూపొందిస్తున్న చారిత్రక చిత్రం 'పానిపట్‌'. సంజయ్‌ దత్‌, అర్జున్‌ కపూర్‌, కృతిసనన్‌ తదితరులు ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. సునీత గోవరికర్‌, రోహిత్‌ షీలాత్కర్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్‌డేట్‌ బయటకొచ్చింది.

ఈ చిత్ర ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అంతేకాదు.. అహ్మద్‌ షా అబ్దాలీగా సంజయ్‌ లుక్‌తో పాటు పార్వతీ బాయిగా కృతి సనన్‌ లుక్‌లను విడుదల చేసింది. ఈ పోస్టర్లలో సంజయ్‌ తలపై గొలుసులతో డిజైన్‌ చేయబడిన ఓ కిరీటం పెట్టుకుని ఒంటిపై కవచాలు, గుబురు గడ్డంతో యుద్ధానికి సిద్ధమవుతున్నట్లుగా దర్శనమిచ్చాడు. ఇక కృతి ఓ శక్తిమంతమైన యువ రాణిలా చిరునవ్వులు చిందిస్తూ ఎంతో అందంగా కనిపించింది.

సంజయ్ దత్

ఈ సినిమాలో గోపికాబాయి పాత్రలో పద్మిని కొల్హాపురి, సదాశివరావ్‌ అనే ప్రతినాయక ఛాయలున్న పాత్రలో అర్జున్‌ కపూర్‌ కనిపించబోతున్నారు. మరి వీళ్లంతా తెరపై ఎలా దర్శనమివ్వబోతున్నారో చూడాలంటే రేపు ట్రైలర్‌ వచ్చే వరకు వేచి చూడక తప్పదు. మరాఠా యోధులు, అఫ్గాన్ సైన్యానికి మధ్య జరిగిన మూడవ పానిపట్‌ యుద్ధం సృష్టించిన రక్తపాతాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారు. డిసెంబరు 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుందీ సినిమా.

కృతి సనన్

ఇవీ చూడండి.. 'దిల్లీలో షూటింగ్ చాలా కష్టంగా ఉంది'

ABOUT THE AUTHOR

...view details