దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. కొవిడ్ కారణంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో క్లిష్టపరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే కొవిడ్ వైరస్ తీవ్రతను ఎదుర్కొనేందుకు ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరుతూ కోలీవుడ్ సెలబ్రిటీలు ఓ స్పెషల్ వీడియో షేర్ చేశారు. కొవిడ్ సెకండ్‌వేవ్ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ రోటరీ క్లబ్ ఆఫ్ మద్రాస్ వారు రూపొందించిన ఓ వీడియోలో సుహాసిని, మాధవన్, అరవింద్ స్వామి, నాజర్, రాధిక, తదితరులు భాగమయ్యారు.
కరోనా తీవ్రతపై కోలీవుడ్ ప్రముఖులు ఏమన్నారంటే! - అరవింద స్వామి కరోనా
కరోనా తీవ్రతను ఎదుర్కొనేందుకు ప్రతిఒక్కరూ వాక్సిన్ వేయించుకోవాలని ప్రజలకు కోలీవుడ్ ప్రముఖులు విజ్ఞప్తి చేశారు. కొవిడ్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కొంతమంది తారలు సూచనలు చేసిన వీడియోను మద్రాస్ రోటరీ క్లబ్ విడుదల చేసింది.
"ఇది క్లిష్టమైన సమయం.. వైరస్ వ్యాప్తి చెందకుండా చేయాల్సిన సమయమిది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ అతివేగంగా విస్తరిస్తోంది. మనకు మనమే వ్యక్తిగతంగా జాగ్రత్తలు పాటించాలి. చిన్న పొరపాటుకు సైతం పెద్ద మొత్తంలో మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్ ధరించండి. సామాజిక దూరం పాటించండి. తరచూ చేతులు శుభ్రం చేసుకోండి. అలాగే ఈ పరిస్థితుల్లోనూ మనకు కొంతమేర ఊరటనిస్తున్న విషయమేమిటంటే కొవిడ్ వ్యాక్సిన్. 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోండి. కరోనా వ్యాక్సిన్ మన కోసం. మన భద్రత కోసం. వ్యాక్సిన్ సురక్షితమైనదని గుర్తించండి. కరోనాతో పోరాటం చేద్దాం. కరోనాను నిర్మూలిద్దాం" అని కోలీవుడ్ సెలబ్రిటీలు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:కేబీసీ 13వ సీజన్‌కు రంగం సిద్ధం!