తెలంగాణ

telangana

ETV Bharat / sitara

శోభన్​బాబు ఆస్తిలో సగం వాటా అడిగిన దర్శకుడు! - శోభన్​బాబు ఆస్తి

టాలీవుడ్​ సీనియర్​ హీరో శోభన్​బాబుతో ఓ సంద్భరంలో ఆయన ఆస్తిని రాసివ్వాలని అడిగినట్లు గుర్తుచేసుకున్నారు ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి. 'తప్పుచేసి పప్పుకూడు' 'ఖైదీ' సహా పలు హిట్​ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారీయన.

sobhanbabu
శోభన్​బాబు

By

Published : Jul 7, 2020, 10:43 AM IST

టాలీవుడ్​ ప్రముఖ దర్శకుల్లో కోదండరామిరెడ్డి ఒకరు. అయితే తాజాగా సీనియర్​ హీరో శోభన్​ బాబు, తనకు మధ్య జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను నెమరువేసుకున్నారు. అప్పట్లో శోభన్​ ఆస్తిని తనకు ఇవ్వమని అడిగినట్లు గుర్తుచేసుకున్నారు.

అప్పట్లో కోదండరామిరెడ్డిని నెల్లూరు శోభన్‌ బాబు అనేవారు. ఇద్దరికీ దగ్గర పోలికలు ఉండేవి. ఓ సందర్భంలో "నీకూ నాకూ పోలికలున్నాయి" అని కోదండతో చెప్పారు శోభన్‌ బాబు. "అయితే, సగం ఆస్తి రాసివ్వండి" అని బదులిచ్చారు రామిరెడ్డి. అది కుదరదంటూ నవ్వేశారు శోభన్‌. తాజాగా ఈ నవ్వుల జ్ఞాపకాన్ని నెమరువేసుకున్నారు రామిరెడ్డి.

టాలీవుడ్​లో 93 చిత్రాలను తెరకెక్కించారు రామిరెడ్డి. వాటిలో 80 సినిమాలు భారీ విజయం అందుకోవడం ఓ సంచలనం. 'తప్పుచేసి పప్పుకూడు', 'ముఠా మేస్త్రి', 'కొండవీటి దొంగ', 'ఖైదీ' వంటి సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

శోభన్​బాబు

ఇది చూడండి : సుశాంత్ కేసులో పోలీస్ స్టేషన్​కు దర్శకుడు భన్సాలీ

ABOUT THE AUTHOR

...view details