తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఎడారిలో ''ది ఘోస్ట్‌' యాక్షన్..​ ట్రైలర్‌తో 'గని' - ది ఘోస్ట్ మూవీ లేటెస్ట్ న్యూస్

కింగ్ నాగార్జున యాక్షన్‌ థ్రిల్లర్‌ 'ది ఘోస్ట్‌'లో భాగంగా.. నాగ్​పై భారీయాక్షన్​ సీక్వెన్స్​ తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. మరోవైపు గని ట్రైలర్ ఈనెల 17న విడుదల చేయనుంది.

king nagarjuna the ghost and ghani trailer release date
ఎడారిలో 'కింగ్' యాక్షన్..​ ట్రైలర్‌తో 'గని'

By

Published : Mar 16, 2022, 7:22 AM IST

king nagarjuna the ghost news: నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ 'ది ఘోస్ట్‌'. నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సోనాల్‌ చౌహాన్‌ కథానాయిక. దుబాయ్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఇప్పుడీ షెడ్యూల్‌లో భాగంగా నాగ్‌పై భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను మంగళవారం సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు చిత్ర దర్శకుడు.

.

ఆ ఫొటోల్లో నాగ్‌ రేసింగ్‌ బైక్‌తో ఛేజింగ్‌కు సిద్ధమవుతున్నట్లుగా కనిపించారు. చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి ఈ సీక్వెన్స్‌ను అక్కడి ఏడారిలో చిత్రీకరిస్తున్నట్లు అర్థమవుతోంది.

"థ్రిల్లింగ్‌ అంశాలతో ఒక మంచి యాక్షన్‌ సినిమాగా దీన్ని రూపొందిస్తున్నాం. నాగార్జున శక్తిమంతమైన అవతారంలో కనిపిస్తారు. ఆయన లుక్‌ చాలా కొత్తగా ఉంటుంది" అని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాకి యాక్షన్‌: రాబిన్‌ సుబ్బు, నభా, కళ: బ్రహ్మ కడలి, ఛాయాగ్రహణం: ముఖేష్‌.

గని ట్రైలర్​ ఎప్పుడంటే..?

ghani movie news:వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించిన క్రీడా నేపథ్య చిత్రం 'గని'. కిరణ్‌ కొర్రపాటి తెరకెక్కించారు. అల్లు బాబీ, సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మించారు. సయీ మంజ్రేకర్‌ కథానాయిక. ఈ సినిమా ఏప్రిల్‌ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈనెల 17న ఉదయం 10.30 గంటలకు ట్రైలర్‌ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం మంగళవారం అధికారికంగా ప్రకటించింది. "బాక్సింగ్‌ ఆట నేపథ్యంగా అల్లుకున్న కథతో రూపొందిన చిత్రమిది. ఇందులో వరుణ్‌ ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా కసరత్తులు చేసి తనశరీరాకృతిని మార్చుకున్నారు" అని చిత్ర వర్గాలు తెలిపాయి.

.

ఈ సినిమాలో సునీల్‌ శెట్టి, జగపతిబాబు, ఉపేంద్ర, నవీన్‌ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ స్వరాలందిస్తున్నారు. ఆర్‌.రవీందర్‌ రెడ్డి ప్రొడక్షన్‌ డిజైనర్‌గా, జార్జ్‌ సి విలియమ్స్‌ ఛాయాగ్రాహకుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.

ఇదీ చూడండి:'రాధేశ్యామ్​' స్పెషల్​ ట్రీట్​.. 'మేజర్'​ సందీప్​గా మెప్పించిన శేష్​!

ABOUT THE AUTHOR

...view details