తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మరో నెట్​ఫ్లిక్స్​ చిత్రంతో రానున్న కియారా - karan

లస్ట్ స్టోరీస్​తో డిజిటల్ ప్లాట్​ఫామ్​లో హిట్ కొట్టిన కియారా అడ్వాణీ మరో నెట్​ఫ్లిక్స్ చిత్రంలో నటించబోతుంది. గిల్టీ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు కరణ్ జోహార్ నిర్మాత.

కియారా

By

Published : Jun 26, 2019, 7:00 AM IST

Updated : Jun 26, 2019, 8:36 AM IST

కబీర్ సింగ్​తో​ ఘనవిజయాన్ని అందుకున్న బాలీవుడ్ నటి కియారా అడ్వాణీ.. త్వరలో నెట్​ఫ్లిక్స్​ చిత్రంతో రాబోతుంది. గిల్టీ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు. రుచి నరైన్ దర్శకత్వం వహించే చిత్రం ఈ ఏడాది చివరిలోగా నెట్​ఫ్లిక్స్​లో విడుదల కానుంది.

కళాశాలలో చదువుకుంటున్న ఓ అమ్మాయి అదే కాలేజీకి చెందిన ఓ అబ్బాయిపై లైంగిక ఆరోపణలు చేస్తుంది. వివిధ కోణాలను స్పృశిస్తూ నిజమైన దోషి ఎవరనేదే చిత్ర కథాంశం. దర్శకురాలిగా రుచి నరైన్ ఇంతకముందు హజ్రాన్ ఖ్వైషేన్ అయిసీ, కోల్​కతా మెయిల్ లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది.

కియరా అడ్వాణీతో కరణ్​జోహార్ ఇంతకముందే 'లస్ట్​ స్టోరీస్' అనే నెట్​ఫ్లిక్స్ చిత్రాన్ని నిర్మించాడు. వీరి కలయికలో వస్తున్న రెండో చిత్రం గిల్టీ.

ఇది చదవండి: ఆ ముగ్గురూ కలిసింది.. అందుకేనా ?

Last Updated : Jun 26, 2019, 8:36 AM IST

ABOUT THE AUTHOR

...view details