బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలీ నందా.. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను బహిరంగపరిచింది. అతిలోకసుందరి శ్రీదేవి కూతురు ఖుషీ కపూర్ కూడా ఇదే బాట పట్టింది. ఇద్దరూ తమ జీవిత విశేషాలను ప్రజల ముందుంచడానికి వారి ఖాతాల ప్రైవసీ తొలగించి పబ్లిక్కు మార్చారు.
నటుడు మీజాన్తో రిలేషన్షిప్ కారణంగా నవ్య నవేలీ వార్తల్లో నిలుస్తూ వచ్చింది. సినిమాల్లో అరంగేట్రం చేయకున్నా.. సామాజిక మాధ్యమాల్లో ఆమెను అనుసరించేవారి సంఖ్య వేలల్లో ఉంది. ఇన్‌స్టాలో నవ్యకు చాలా ఫ్యాన్ పేజీలున్నాయి. 2017 ఆగస్టులో ఖాతా తెరిచిన ఆమెకు ప్రస్తుతం 86వేల పైచిలుకు ఫాలోవర్లు ఉన్నారు.