భారత్లో కరోనా ప్రభావం పేద ప్రజలపై తీవ్రంగా పడింది. ప్రస్తుతమున్న లాక్డౌన్ పరిస్థితుల వల్ల వారి రోజుగడవడం కష్టమైంది. అయితే ఇలాంటి సమయంలోనే 'కేజీఎఫ్' సంగీత దర్శకుడు రవి బస్రూర్.. ఆభరణాలు తయారు చేస్తూ రోజుకూ రూ.35 సంపాదిస్తున్నాడు. ఆ ఆసక్తికర వీడియోలను ఫేస్బుక్లో పంచుకున్నాడు.
రోజుకు రూ.35 సంపాదిస్తున్న 'కేజీఎఫ్' సంగీత దర్శకుడు - entertainment news
కరోనా వల్ల సొంతూరికి వెళ్లిన సంగీత దర్శకుడు రవి బస్రూర్.. ఆభరణాలు, పనిముట్లు తయారీలో తండ్రికి సాయం చేస్తున్నాడు. ఆ వీడియోలు ప్రస్తుతం వైరల్గా మారాయి.
రవి బస్రూర్
ప్రస్తుతం షూటింగ్లు వాయిదా పడటం వల్ల, ఉడిపిలోని తన స్వగ్రామం కుందాపురాకు వెళ్లిపోయాడు రవి బస్రూర్. ఆభరణాల తయారీలో తన తండ్రికి సాయం చేస్తున్నాడు. అయితే పాత జ్ఞాపకాలు నెమరవేసుకునే అదృష్టాన్ని దేవుడు తమకు ఇచ్చాడని రాసుకొచ్చాడు.