తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'కేజీఎఫ్ 2' థియేటర్లకు వచ్చేది అప్పుడేనా? - దసరాకు కేజీఎఫ్ 2 రిలిజ్

యశ్ హీరోగా తెరకెక్కుతోన్న 'కేజీఎఫ్ 2' విడుదల వాయిదా పడ్డట్లేనని తెలుస్తోంది. అయితే ఈ ఏడాది దసరా పండగ నాటికి ఈ చిత్రాన్ని థియేటర్లకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోందట.

KGF Chapter 2
కేజీఎఫ్ 2

By

Published : May 11, 2021, 4:48 PM IST

యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో 'కేజీయఫ్‌' సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం 'కేజీయఫ్‌ 2'. జులై 16న తెరపైకి రావాల్సిన ఈ సినిమా ప్రస్తుతం కరోనా కేసులు పెరగడం కారణంగా వాయిదా పడినట్లే. అయితే, దసరా పండగ నాటికి విడుదల చేసేందుకు నిర్మాణ సంస్థ సన్నద్ధమైందని సమాచారం.

ఇప్పటికే సినిమా కన్నడ వెర్షన్‌ డబ్బింగ్‌ పూర్తయింది. ఆ మధ్య దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ డబ్బింగ్‌ స్టూడియోలో హీరో యశ్‌తో కలిసి దిగిన ఫొటోను తన ట్విట్టర్​లో షేర్ చేశారు. పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రవి బ్రసూర్ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు.

హోంబలే ఫిల్మ్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. సంజయ్‌దత్‌ అధీరా పాత్రలో నటిస్తుండగా రవీనా టాండన్ ప్రధాని రమికా సేన్ పాత్రలో కనిపించనుంది. ప్రకాశ్‌రాజ్‌, అనంత్‌ నాగ్‌, రావు రమేశ్‌, ఈశ్వరీరావు, టీఎస్‌ నాగాభరణ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details