తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అలాంటి పాత్ర‌ల‌కైనా రెడీ అంటున్న కీర్తి - keerti sursesh about charecters

'మహానటి' తర్వాత నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ బిజీగా ఉంది హీరోయిన్ కీర్తి సురేశ్. ఓ ఇంటర్వ్యూలో తను చేయాలనుకుంటున్న పాత్రలపై క్లారిటీ ఇచ్చింది.

కీర్తి

By

Published : Nov 13, 2019, 5:37 AM IST

కీర్తి సురేశ్ అన‌గానే ఇప్పుడంద‌రికీ 'మ‌హాన‌టి' సినిమానే గుర్తుకొస్తుంది. ఆ చిత్రంతో అంత‌గా ఈ హీరోయిన్​ ప్రేక్ష‌కుల‌పై ముద్ర వేసింది. 'మ‌హాన‌టి'తో వ‌చ్చిన గుర్తింపుని నిల‌బెట్టుకోవాల‌నే త‌ప‌న కీర్తిలో ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ప్రస్తుతం నాయికా ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల‌పైనే దృష్టిపెట్టింది. ఇటీవ‌ల ఒక ఇంట‌ర్వ్యూలో అదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తూ న‌ట‌న‌కి ప్రాధాన్యం ఉందంటే ఇక‌పై తాను డీ గ్లామ‌ర్ పాత్ర‌ల‌కైనా సిద్ధ‌మే అని చెప్పుకొచ్చింది.

కీర్తి సురేశ్

అందాలరాశిలా అపురూపంగా క‌నిపించే కీర్తిని డీ గ్లామ‌ర్ పాత్ర‌ల్లో చూడ‌గ‌ల‌మా..! దీనిపై కీర్తి ఏమంటుందంటే.. "గ్లామ‌ర్ పాత్ర‌లతో డ‌బ్బు చాలా సంపాదించొచ్చు. అలాంటి అవకాశాలూ బోలెడ‌న్ని వ‌స్తున్నాయి. కానీ వాటిని చేసి ఏం లాభం? ఎప్ప‌టికీ ఆ పాత్ర‌లు ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు పొంద‌లేవు. నా వ‌ర‌కు నేను చేసుకొని సంతృప్తి ప‌డాలంతే. అదే న‌ట‌న‌కి ప్రాధాన్య‌మున్న పాత్ర చేశాన‌నుకోండి. వాటి గురించి కొన్నాళ్ల‌పాటు మాట్లాడుకుంటారు ప్రేక్ష‌కులు. అలా గుర్తుండిపోయే పాత్ర‌లు చేయ‌డంలో ఉన్న ఆనందమే వేరు క‌దా. అందుకే తాను డీ గ్లామ‌ర్ పాత్ర‌ల‌కైనా సిద్ధ‌మే అంటున్నా" అంటూ చెప్పుకొచ్చంది కీర్తి.

ప్రస్తుతం నితిన్ సరసన రంగ్​దే, నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో ఓ సినిమాతో పాటు పెంగ్విన్ అనే చిత్రంలో నటిస్తూ బిజీగా ఉందీ నటి.

ఇవీ చూడండి.. ఈ 'జోకర్‌' విలువ ఆరువేల కోట్లు..!

ABOUT THE AUTHOR

...view details