'మహానటి' కీర్తి సురేశ్ తమిళంలో మరో చిత్రానికి ఓకే చెప్పింది. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో 'సానీ కాయిధమ్' అనే చిత్రంలో కీర్తి నటించనుంది. ఈ సినిమా కోసం నటుడిగా మారాడు సంచలన దర్శకుడు సెల్వ రాఘవన్. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఇందులో వీరిద్దరు గ్రామీణ లుక్‌లో కనిపిస్తుండగా.. కీర్తి చేతిలో గన్, సెల్వ చేతిలో కత్తి ఉంది. వీరి ముందు ఓ వాహనం రక్తంతో నిండి ఉండగా, ఆ వెనకాల మరికొంత మంది ఉన్నారు.
ఈ చిత్రం రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. 1980లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు.