"టైగర్ కేసీఆర్" పాట పాడిన దర్శకుడు వర్మ - కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్నాడు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ. ఈ సినిమాలోని ఓ పాటను ఆయనే స్వయంగా పాడి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
టైగర్ కేసీఆర్‌పై పాట పాడిన వర్మ
నిజ జీవిత కథలను తెరకెక్కిస్తూ సంచలనాలు సృష్టిస్తుంటాడు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. తాజాగా ఆయన నిర్మిస్తోన్న మరో ప్రాజెక్టు తెలంగాణ సీఎం కేసీఆర్ బయోపిక్. ఈ చిత్ర టైటిల్‌ను 'టైగర్..కేసీఆర్'గా ఇప్పటికే ప్రకటించారు. ఈరోజు సినిమా టీజర్ అంటూ రాంగోపాల్‌వర్మ పాట పాడి ఆ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు.