బాలీవుడ్‌లో ప్రచారపర్వం కొత్తపుంతలు తొక్కుతోంది. ఈ క్రమంలో సరికొత్త ఛాలెంజ్‌లు వస్తున్నాయి. ఇటీవలే 'హౌస్‌ఫుల్ 4' ప్రచారం కోసం అక్షయ్‌కుమార్ 'బాలా ఛాలెంజ్'ను ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. నెట్టింట విశేష ఆదరణ దక్కింది. ఎంతో మంది సినీ ప్రముఖులు అక్కీ ఛాలెంజ్‌ను స్వీకరించి "బాలా.." గీతానికి తమదైన శైలిలో స్టెప్పులేసి అదరగొట్టారు.
ఎయిర్‌పోర్ట్‌లో యువహీరోతో దీపిక పదుకొణె స్టెప్పులు - artik Aaryan-deepika pdukone
"ధీమే ధీమే" ఛాలెంజ్‌లో భాగంగా యువహీరో కార్తిక్ ఆర్యన్‌తో కలిసి స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె డ్యాన్స్ చేసింది. ముంబయి విమానాశ్రయం ఇందుకు వేదికైంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
దీనిని స్ఫూర్తిగా తీసుకున్న బాలీవుడ్ యువ హీరో కార్తిక్ ఆర్యన్.. తన కొత్త చిత్రం 'పతీ పత్ని ఔర్ ఓ' కోసం "ధీమే ధీమే.. ఛాలెంజ్"ను తీసుకొచ్చాడు. ఈ సవాల్‌ను స్వీకరించిన వారు.. "ధీమే ధీమే.." గీతానికి తమదైన శైలిలో స్టెప్పులు వేయాల్సి ఉంటుంది. తాజాగా ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన దీపిక పదుకొణె.. ముంబయి విమానాశ్రయంలో కార్తిక్‌తో కలిసి ఆ పాటకు స్టెప్పులేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్‌గా మారాయి. అంతేకాకుండా ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేయాల్సిందిగా తన భర్త రణ్‌వీర్ సింగ్‌కు సవాల్ విసిరిందీ భామ.
ఇది చదవండి: స్వర్ణ దేవాలయ సందర్శనలో దీపిక-రణ్‌వీర్