తెలంగాణ

telangana

ETV Bharat / sitara

త్వరలో దోస్తానాకు సీక్వెల్.. కార్తీక్ ఆర్యన్ హీరో - kartik aryan

2008లో ఘనవిజయం సాధించిన బాలీవుడ్ చిత్రం దోస్తానాకు సీక్వెల్ రాబోతుంది. ఇందులో కార్తీక్ ఆర్యన్, జాన్వీ కపూర్ జంటగా నటించనున్నారు. కరణ్​జోహార్ నిర్మాత.

దోస్తానా2

By

Published : Jun 28, 2019, 5:58 AM IST

Updated : Jun 28, 2019, 1:21 PM IST

జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్, ప్రియాంక చోప్రా కలయికలో 2008లో ఘన విజయమైన చిత్రం దోస్తానా. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. కార్తీక్ ఆర్యన్, జాన్వీ కపూర్ జంటగా నటించనున్నారు. కరణ్​జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఓ అపార్ట్​మెంట్లో అద్దేకు ఉండేందుకు స్వలింగ సంపర్కులుగా నటించే ఇద్దరి యువకులపై హాస్యబరితంగా సాగుతుంది మొదటి చిత్రం. ప్రస్తుతం సీక్వెల్​లో కొలిన్ డి కున్హా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. కార్తీక్​తో పాటు మరో కొత్త హీరో ఈ సినిమాలో నటించనున్నాడు.

"కార్తీక్, జాన్వీ కపూర్​లతో దోస్తానా సీక్వెల్ తీసేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా. ధర్మా ప్రొడక్షన్స్​లో కార్తీక్​ తొలిసారి నటించనున్నాడు. మరో కొత్త హీరోను ఈ సినిమా ద్వారా పరిచయం చేయబోతున్నా" -కరణ్​ జోహార్, బాలీవుడ్ దర్శక నిర్మాత.

శ్రీదేవి ముద్దుల తనయగా బాలీవుడ్​లో ధడక్ చిత్రం ద్వారా అరంగేట్రం చేసింది జాన్వీ కపూర్. ప్రస్తుతం తఖ్త్​ అనే చిత్రంలో నటిస్తోంది. కార్తీక్ ఆర్యన్ 'ప్యార్​ కా పంచనామా' అనే సినిమాతో చిత్రసీమకు పరిచయమయ్యాడు. ఇంతియాజ్ అలీ తీయబోయే చిత్రంలోనూ కార్తీకే హీరో.

Last Updated : Jun 28, 2019, 1:21 PM IST

ABOUT THE AUTHOR

...view details