కరోనా వ్యాప్తి ఎక్కువవుతున్న ప్రస్తుత కాలం, పెళ్లి చేసుకునేందుకు సరైన సమయమని చెప్పాడు బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్. ఎక్కువ ఖర్చు లేకుండా తంతు ముగిసిపోతుందని అన్నాడు. ట్విట్టర్లో అభిమానులతో ముచ్చటించిన సందర్భంగా ఇలా సమధానమిచ్చాడు.
'పెళ్లికి ఇదే సరైన సమయం.. ఖర్చు అక్కర్లేదు' - హీరో కార్తిక్ ఆర్యన్
ప్రస్తుత కాలం పెళ్లికి సరైన సమయమని చెప్పిన హీరో కార్తిక్ ఆర్యన్.. ఇప్పుడు వివాహం చేసుకుంటే ఖర్చు కూడా పెట్టాల్సిన పనిలేదని అన్నాడు.
హీరో కార్తిక్ ఆర్యన్
లాక్డౌన్లో రహస్యంగా పెళ్లి చేసుకున్నాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటిపైనా స్పందించాడు కార్తిక్. ఒకవేళ ఇదే జరిగితే తనకు, లాక్డౌన్లోనే పిల్లాడు పుట్టేస్తాడేమోనని జోక్ చేశాడు.
తన ఆన్లైన్ చాట్ షో 'కోకి పూచేంగా'లోని తర్వాతి ఎపిసోడ్లో మానసిక ఒత్తిడి గురించి మాట్లాడుతానని వెల్లడించాడు. ఇది చాలాముఖ్యమైన అంశమని పేర్కొన్నాడు. హారర్ కామెడీ 'భూల్ భులయ్యా 2', 'దోస్తానా 2' సినిమాలు ప్రస్తుతం చేస్తున్నాడు కార్తిక్ ఆర్యన్.