తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆ విషయంలో అప్పుడు చిరంజీవి​.. ఇప్పుడు నాని​' - కార్తికేయ, సినీ నటుడు

సినిమా నేపథ్యం లేకుండా యాక్టర్​ అవ్వాలనుకునే యువతకు నేచురల్​ స్టార్​ నాని స్ఫూర్తి అని అన్నాడు యువ కథానాయకుడు కార్తికేయ. నానితో కలిసి నటించిన 'గ్యాంగ్​లీడర్'​ ప్రీరిలీజ్​ వేడుక విశాఖపట్నంలో ఘనంగా జరిగింది.

'అప్పుడు మెగాస్టార్​...ఇప్పుడు నేచురల్​స్టార్ ఓ స్ఫూర్తి​'

By

Published : Sep 11, 2019, 11:32 AM IST

Updated : Sep 30, 2019, 5:18 AM IST

సినిమా నేపథ్యంతో సంబంధం లేకుండా యాక్టర్​ అవ్వాలనుకునే వారికి నాని ఓ స్ఫూర్తి అని అభివర్ణించాడు ఆర్​ఎక్స్​ 100 ఫేం కార్తికేయ. నాని ప్రధాన పాత్రలో విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన చిత్రం 'గ్యాంగ్ లీడర్.' ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర పోషించాడు కార్తి. ఈ సినిమా ప్రీ రిలీజ్​ వేడుక విశాఖపట్నంలో ఘనంగా జరిగింది.

" మీలాగే నేను కూడా నానికి పెద్ద ఫ్యాన్. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా నటుడు అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చే వారికి స్ఫూర్తిగా కొన్ని పేర్లు కనపడతాయి. మొదటి పేరు మెగాస్టార్ చిరంజీవి. ఆ తర్వాత రవితేజ. ప్రస్తుతం నాలాంటి యువత ఇంట్లో చెప్పుకోడానికి నాని. ప్రతి విషయంలోనూ ఆయనను స్ఫూర్తిగా తీసుకోవచ్చు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి నేచురల్ స్టార్ అని పేరుతెచ్చుకోవడం మామూలు విషయం కాదు. విక్రమ్​, నానితో కలిసి పనిచేయడం నా అదృష్టం."
--కార్తికేయ, సినీ నటుడు.

ఈ సందర్భంగా సినిమా మేకింగ్​ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ఈ నెల 13న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చదవండి...

Last Updated : Sep 30, 2019, 5:18 AM IST

ABOUT THE AUTHOR

...view details